న్యూఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మూడు రోజుల విరామం అనంతరం సోమవారం సాగిన రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశమే సోమవారం చర్చల్లో కనబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు తెలంగాణ ఏర్పాటు అంశం పై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చడం, ఎంపిలు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాజ్యసభలో తెలంగాణపై చర్చకు అనుమతించారు.