తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం: చిదంబరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలున్నాయని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అనేక సమస్యలు పరిష్కరించాల్సివుంటుందని చెప్పారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ సమగ్ర విధాన పత్రాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని చిదంబరం తెలిపారు. ఇందులో జలవనరులు, విద్యుత్ పంపిణీ, పంపిణీ, ప్రజల భద్రత, ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ అంశాలన్నిటిపై సభలో నిర్మాణాత్మక చర్చ జరుగుతుందన్నారు. తగిన సమయంలో చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేయాలని సీమాంధ్ర ఎంపీలు డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చిదంబరం ప్రకటన చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ద్విసభ్య సంఘంతో సమావేశమయ్యారు.