'అసలు రోహిత్ దళితుడు కాదు' | Rohith Vemula was not a Dalit, claim is baseless, says Sushma Swaraj | Sakshi
Sakshi News home page

'అసలు రోహిత్ దళితుడు కాదు'

Published Sun, Jan 31 2016 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

'అసలు రోహిత్ దళితుడు కాదు'

'అసలు రోహిత్ దళితుడు కాదు'

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన పరిశోధక విద్యార్థి రోహిత్ ఘటన వేడి చల్లారకముందే దానికి మరింత ఆజ్యం పోసేలా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు చేశారు. అసలు రోహిత్ దళితుడే కాదని అన్నారు. మహారాష్ట్రలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 'నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆ విద్యార్థి(రోహిత్) దళితుడు కాదు. కానీ కొంతమంది అతడిని దళితుడిగా చెప్పారు. అసలు అతడు దళితుడు అని చేస్తున్న ప్రచారం పూర్తిగా ఆధారం లేనిది' అని ఆమె అన్నారు.

ఈ నెల 17న రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి హెచ్సీయూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాహుల్ గాంధీ ఇదే అంశంతో ఎన్డీయేపై విరుచుపడ్డారు. ఈ నేపథ్యంలో సుష్మా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement