
రాష్ట్రపతి భవన్ లో 'బ్రా'బోయ్!
ఆ బ్రాని ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది. రేపిస్టుల టాప్ లేచిపోతుంది.
ఆ బ్రాని ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది. రేపిస్టుల టాప్ లేచిపోతుంది. కరెంట్ షాక్ తో లుంగలు చుట్టుకుపోతాడు. కానీ దాన్ని ధరించిన వారికి మాత్రం ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
ఈ ఎలక్ట్రిక్ బ్రా ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లోని ఒక ప్రదర్శనలో దర్శనమివ్వబోతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వినూత్న పరికరాలు, వస్తువుల ప్రదర్శన ఇన్నోవేషన్ స్కాలర్స్ ఇన్ రెసిడెన్స్ లో భాగంగా ఈ బ్రాను ప్రదర్శనలో ఉంచుతారు.
దీన్ని చెన్నై కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మనీషా మోహన్ రూపొందించారు. నిర్భయ సంఘటన ఆమెను కలచివేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేందుకు, మహిళలకు రక్షణనిచ్చేందుకు ఆమె ఈ బ్రాను రూపొందించింది. ఈ బ్రాకి ఆమె షి (SHE) అని పేరు పెట్టింది. ఈ బ్రాలో రెండు పొరలుగా దుస్తులుంటాయి. రెండు పొరల మధ్య ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. బ్రా పై ఒత్తిడి పెరగగానే ఇది షాక్ ఇస్తుంది. అయితే కింద ఉన్న పొర వల్ల ధరించిన వారికి రక్షణనిస్తుంది. దీనిలో ఒక జీపీఎస్ పరికరం కూడా ఉంటుంది. దీని వల్ల రేప్ జరిగిన చోటు ఎక్కడో గుర్తించవచ్చు. నేరగాడిని అరెస్టు చేయడం సులువవుతుంది.
ఇంజనీరింగ్ విద్యార్థులుచేసిన అనేక ఆవిష్కారాలు రాష్ట్రపతిభవన్ ప్రదర్శనలో ఉంచబోతున్నారు.