* బీజేపీ నేతలపై సీఎం ధ్వజం
సాక్షి,బెంగళూరు : ‘బీజేపీ నేతలు చేసే ఆరోపణలను పెద్దగా పట్టించుకోను. అసలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యాచార ఆరోపణలు ఉన్నవారే మంత్రులుగా పనిచేశారు. వారికి నన్ను, నా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక విలువలు లేవు’ అని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరులో బుధవారం జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
తీర్థహళ్లి ఘటన విషయమై బీజేపీ అనవసర రాజకీయం చేస్తోందన్నారు. ఈ ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బోర్డులు, కార్పొరేషన్లకు పదాధికారులను నియమించే ప్రస్తావన ఏదీ ప్రస్తుతానికి లేదన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వివరించడానికి తనతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు సీఎం తెలిపారు.
అత్యాచార ఆరోపణలు ఉన్న వారే మంత్రులుగా పనిచేశారు
Published Thu, Nov 6 2014 2:25 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement