ముంబై: దేశంలో రెండో ఎత్తైన జెండా మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ స్థానిక పోలీస్ గార్డెన్‌లో సోమవారం 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కేఎస్‌బీపీ ట్రస్టు ఈ జెండాను ఏర్పాటు చేసింది. ట్రస్టు అధ్యక్షుడు పిత్రే మాట్లాడుతూ 90 అడుగుల పొడవు, 60అడుగుల వెడల్పున్న జెండా ఏర్పాటుకు రూ.1.1 కోట్ల ఖర్చయిందన్నారు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద(360 అడుగులు) ఉంది.