న్యూఢిల్లీ : యూపీఎస్సీ పరీక్షల వివాదం మంగళవారం రాజ్యసభను కుదిపేసింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకోబోమన్న .... కేంద్రం ప్రకటనతో ప్రతిపక్షాలు శాంతించలేదు. యూపీఎస్సీ తీరు వల్ల ప్రాంతీయ భాషలకు అన్యాయం జరుగుతుందంటూ తెలుగు, తమిళ ఎంపీలు ఆందోళనకు దిగారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సీశాట్‌ను రద్దు చేయాల్సిందేనంటూ రాజ్యసభలో పట్టుపట్టారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఛైర్మన్ హామీద్ అన్సారీ కోరినా సభ్యులు శాంతించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఎంపీలు ఆరోపించారు. కాగా ఎంపీల వ్యవహార శైలిపై అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు.