ఇది సార్క్ యాత్రే కానీ పాక్ యాత్ర కాదే..! | Aakar patel write a story on pakistan | Sakshi
Sakshi News home page

ఇది సార్క్ యాత్రే కానీ పాక్ యాత్ర కాదే..!

Published Sun, Mar 1 2015 8:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

ఇది సార్క్ యాత్రే కానీ పాక్ యాత్ర కాదే..!

ఇది సార్క్ యాత్రే కానీ పాక్ యాత్ర కాదే..!

జమ్మూకశ్మీర్ రాష్ట్ర చరిత్రలోనే నేడు అత్యంత స్పల్పస్థాయిలో హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. పైగా కశ్మీర్ లోపల వేర్పాటువాద భావన తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో పాకిస్తాన్ కంటే భారత్‌కే సౌకర్యవంతంగా ఉండబోతోందన్నది వాస్తవం.
 
భారత విదేశీ మంత్రి త్వశాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ మంగళవా రం పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అద్భుత ఫలితాలను భారత్ ఆశించడం లేదని పీటీఐ వార్తా నివేదిక తెలిపిం ది. ఆయన చేస్తున్నది సార్క్ పర్యటనే కానీ పాక్ పర్యటన కాదని నొక్కి చెప్పింది. పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తకు ఈ వార్తను చూపించాను. ఈ కథనం జయశంకర్ పాక్ పర్యటనపై అంచనాలను తగ్గించడానికే లీక్ చేశా రని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే పాకి స్తాన్‌తో భారత సంబంధాలలో పెనుమార్పు చోటు చేసుకుంటోందన్నమాట. నా అంచనా ప్రకారం భారత్ ప్రస్తుత ఆలోచనాతీరును ఈ లీక్ ప్రతిఫలి స్తోంది. పాకిస్తాన్‌తో సంబంధాలు అంత ముఖ్యం కాదన్నదే ఇప్పటి మన ఆలోచనా తీరు.
 
నేను ఎందుకిలా చెబుతున్నానో వివరించనీ యండి. భారత్ ప్రధానంగా రెండు అంశాలపై పాకి స్తాన్‌తో వ్యవహరిస్తోంది. అవి ఉగ్రవాదం, కశ్మీర్. వీటిలో మొదటిది భారత్‌కు ప్రధాన సమస్య కాగా, రెండోది పాకిస్తాన్‌కు ముఖ్య సమస్య.  వాస్తవమేమి టంటే, భారత్‌లో ఉగ్రవాదం ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో ఉంది. కశ్మీర్, ఈశాన్య భారతం, మావోయిస్టు యుద్ధ రంగాలకు వెలుపల ఈ ఏడాది భారత్‌లో ఉగ్రవాద దాడుల్లో ఏ ఒక్కరూ మరణిం చలేదు.

గత ఏడాది దేశం మొత్తం మీద ఉగ్రవాద దాడుల్లో నలుగురు మాత్రమే చనిపోయారు. అం తకు మునుపటి ఏడాది 25 మంది చనిపోగా వీరిలో 18 మంది హైదరాబాద్‌లో ఇండియన్ ముజాహి దీన్ చేసినట్లు చెబుతున్న దాడిలో చనిపోయారు. కాగా, ఆ మునుపటి ఏడాది అంటే 2012లో ఉగ్ర వాద దాడుల్లో ఒక్కరంటే ఒక్కరే చనిపోయారు.
 
 భారతీయ మీడియా చెబుతున్న దాని ప్రకారం మనం పాకిస్తాన్‌లోని మిలిటెంట్ బృందాల ముట్ట డిలో ఉన్నామన్నమాట. నిజానికి, ఇస్లామిక్ హింసా త్మక చర్యలకు సంబంధించి చూస్తే, యూరోపియ న్లతో పోలిస్తే భారతీయులు సురక్షితంగానే ఉన్నా రు. ఉగ్రవాద దాడులకు భారతీయ నగరాలు ప్రపం చంలోనే అత్యంత తక్కువగా ప్రభావితమవుతు న్నాయి. ఈ కోణంలో చూస్తే భారత్‌కు పాకిస్తాన్ అవసరం చాలా తక్కువే అని చెప్పాలి. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ అందించిన వివరాలు వేళ్ల మీద మాత్రమే లెక్కించవచ్చు. ముంబై నగరంపై దాడిచేసిన వారిని విచారించడం వేగవంతం కావల సిన అవసరం ఉంది.. పలువురు పాకిస్తానీయులు సైతం దీన్ని గుర్తిస్తున్నారు.
 
 అయితే ఇది ప్రధాన సమస్య కాదు. భారత్‌కు సంబంధించినంతవరకు సీమాంతర ఉగ్రవాదమే ప్రధానమైంది. ఇది ఇప్పుడు అన్ని కాలాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని నేను మళ్లీ చెబుతు న్నాను. భారత్‌లో ఉగ్రవాద చర్యలు పెరగడానికి పాకిస్తాన్‌దే బాధ్యత అని మనం చెబుతున్నట్లయితే, ఆ ఉగ్రవాదాన్ని తగ్గించడంలో కూడా పాకిస్తాన్ బాధ్యతే ఎక్కువగా ఉందని మనం అంగీకరించి తీరాలి. ఈ విషయానికి సంబంధించి మోదీ ప్రభు త్వం పాకిస్తాన్ నుంచి తనక్కావలసిందాన్ని ఇప్ప టికే చాలావరకు పొందిందనే చెప్పాలి. నా అభి ప్రాయం ప్రకారం పాకిస్తాన్‌తో తీవ్రంగా వ్యవహ రించవలసిన అవసరం ఇప్పుడు లేదని భారత ప్రభుత్వం భావిస్తోంది.
 
 మరోవైపున పాకిస్తాన్‌కు కశ్మీర్ ప్రధాన సమస్య. దాని పరిష్కారమే ఆ దేశానికి కీలకమైనది. ఇక్కడే భారత్‌పై రెండు రంగాల్లో ఒత్తిడి పడుతోం ది. మొదటిది కశ్మీర్‌లో ఉగ్రవాదం. దీనికి పాకిస్తాన్ మద్దతు ఉంది. అసంఖ్యాక భారతీయ సైనికులు కశ్మీర్ ఉగ్రవాదంతో పోరులో కూరుకుపోయేలా పాక్ చేయగలుగుతోంది. రెండో అంశం ఏదంటే, ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనేందుకు చాలా మంది కశ్మీరీలు నేటికీ వ్యతిరేకత తెల్పుతుండటమే. వీరి దృష్టి నేటికీ ఆజాదీ పైనే ఉంది. 2001లో జమ్మూకశ్మీర్‌లో 4,507 మంది హతమయ్యారు. రాష్ట్ర చరిత్రలో అది అత్యంత హింసాత్మకమైన ఏడా ది.
 
 2003 వరకు ప్రతి ఏటా 2 వేల మంది హతం కాగా, 2004 నుంచి 2006 వరకు ఈ సంఖ్య వెయ్యి కి పడిపోయింది. 2011 నుంచి హతమైన ఉగ్రవాదు లు, పౌరులు, సైనికుల సంఖ్య 200 లోపు మాత్ర మే. కాగా గత దశాబ్ది మొత్తంమీద ఈ సంవత్సరం అత్యంత సురక్షితమైన, తక్కువ హింసాత్మక చర్య లు జరిగిన ఏడాదిగా నమోదయింది.
 
  కశ్మీర్‌లో గత 25 ఏళ్లలో అంటే వేర్పాటువాదం ప్రారంభమైనప్పటినుంచి అత్యంత తక్కువ స్థాయి హింస జరుగుతోంది. రాజకీయ రంగం విషయానికి వస్తే కశ్మీర్‌లో ఓటు వేస్తున్న వారి సంఖ్య ప్రస్తుత సమస్యలు ప్రారంభం కావడానికి ముందు (అంటే 1980ల చివరలో) నాటి స్థాయికి చేరుకున్నాయి. ఇతర రాష్ట్రాలలోని భారతీయుల వలెనే కశ్మీరీయు లు అనేకమంది తమ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేస్తున్నారు. వేర్పాటువాదుల పట్ల సానుభూతి చూపే ముఫ్తీ మహమ్మద్ సయీద్‌కి చెందిన పీడీపీ సైతం వేర్పాటువాద భావనలను ప్రధాన స్రవంతి రాజకీయాలలో కలిపేస్తోంది. అయితే  దీంతో వేర్పా టువాద మనోభావాలు ముగిసిపోతాయని అర్థం కాదు. ఏమైనప్పటికీ పైన పేర్కొన్నట్టుగా కశ్మీర్‌లో హింసాత్మక చర్యలు దాదాపు లేకుండాపోయాయి కాబట్టి కశ్మీర్ వివాదంపై చర్యలు తీసుకోవడంపై భారత్‌పైనే ప్రస్తుతం ఒత్తిడి పడుతోంది.
 
 ఉగ్రవాదం, కశ్మీర్ అనే రెండు సమస్యలకు వెలుపల, ఇరు దేశాల వాణిజ్యం చట్టబద్ధ, చట్టవ్య తిరేక మార్గాల్లో దోబూచులాడుతోంది. మధ్య ఆసి యా నుంచి పాకిస్తాన్ ద్వారా భారత్‌కు రావలసిన ఇంధన సరఫరా అప్ఘానిస్తాన్‌లో సమస్యల కారణం గానే ఆగిపోయింది కానీ దానికి పాకిస్తాన్ కారణం కాదు. కాబట్టి దీనిపై ఇక చర్చించవలసిన అవస రమేంటి?
 
 ఇకపోతే వీసాలు వంటి చిన్న చిన్న విషయా లున్నాయి. దీనికి సంబంధించి కరాచీలో వేరుపడి పోయిన కుటుంబాల పట్ల బీజేపీ ఎలాంటి సాను భూతీ చూపడం లేదు. ఎందుకంటే ముస్లింలు ఈ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలలో ఉండరు. పైగా ప్రభుత్వంలో వీరి తరపున ప్రాతినిధ్యం వహించే బలమైన లాబీ బృందం కూడా లేదు. ఈ విషయం లో వీరెన్ని బాధలకు గురవుతున్నా ఎవరికీ పట్టింపు లేదు. ఈ అన్ని కారణాలవల్ల ప్రస్తుతం భారత్ తాను సౌకర్యవంతంగా ఉన్నట్లు, వచ్చే వారం జర గనున్న సమావేశంలో పాకిస్తాన్‌తో నింపాదిగా వ్యవహరించగలనని భావిస్తున్నట్లు నేను అభిప్రా యపడుతున్నాను.


 ఆకార్ పటేల్

(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
 ఈమెయిల్: aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement