భూమి కోసం ఏం చేద్దాం?
విశ్లేషణ
మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ యుగంలో వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి.
పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంపై ఒక అమెరికన్ విదూషకుడు ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. శ్వేతసౌధంలో ఆ ప్రకటనను చేసిన ప్రదే శాన్ని దృష్టిలో ఉంచుకుని ‘‘ఈ లెక్కన చూస్తే, ఇలా మాట తప్పేట్టయితే అప్పుడిక్కడ ఉండేది గులాబీల తోట కాదు, బ్రహ్మజెముడు వనం’’ అని వ్యాఖ్యానించాడు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ, మిగతా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రధానమైనవి మాత్రం తమ వాగ్దానాలకు కట్టుబడి ముందుకు సాగాలనే కృత నిశ్చయాన్ని చూపాయి.
తక్షణమే స్పందించడం ద్వారా బరాక్ ఒబామా... అమెరికా నగరాలు, వ్యాపార సంస్థలు పారిస్ ఒప్పందంలోని వాగ్దానాలకు కట్టుబడటానికి సమీకృతం కావడానికి తోడ్పడింది. ఆశా రేఖ తొంగి చూస్తు న్నది ఇక్కడే. వాతావరణ మార్పుల విపత్కర విపరిణామాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల కంటే ప్రజలే ఎక్కువ పాత్రను నిర్వహించాల్సి ఉంది. ఒక సమాజంగా మనం ఈ విషయంలో ఏమైనా చేస్తున్నామా? భరింపశక్యంకాని వేసవి మన దేశంలో ఇప్పుడు ముగింపునకు వస్తోంది. ఈ వేసవి, వాతావరణ మార్పు గురించి మనం ఏమైనా చేయా లని మెత్తగా తట్టి చెప్పడానికి మించి చేసిన హెచ్చరిక. దీన్ని పూర్తిగా ప్రభుత్వాలకు వదిలి పెట్టేయడం తీవ్ర తప్పిదం అవు తుంది. ప్రభుత్వాలు ఆలోచిస్తాయే తప్ప, తమ సొంత లక్ష్యాలను సాధిం చడానికి తగినంతగానూ, త్వరితం గానూ ఎప్పుడూ అవి ఆచరణకు దిగవు. ఇది కేంద్రం నుంచి గ్రామ పంచాయతీల వరకు అంతటా ఉన్నది.
పారిస్ ఒప్పందం వివరాల జోలికి పోవడం లేదు. కాకపోతే సంపన్నదేశాలు వాతా వరణాన్ని కొల్లగొట్టడంవల్ల అభివృద్ధిచెందిన దేశాలు మూల్యాన్ని చెల్లించాల్సి రావడం, లక్ష్యాల సాధన వాటికి కష్టం కావడం వంటి సమస్యలున్నాయి. అయినా పౌరులుగా మనం, మన పాత్ర విమర్శనాత్మకంగా ఉండటానికీ, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా కొవ్వొత్తుల ఊరేగింపులు జరపడం, మానవ హారాలను నిర్మించడానికీ పరిమితమని తరచుగా భావిస్తుంటాం. విషాదకరంగా మనం మన చిన్న పరిధులలోనే చేయగల సాను కూల కార్యాచరణ మాత్రం కానరాదు. ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాలని కారు బయటకు తీసి నప్పుడల్లా అది వాతావరణానికి హానికరమైన ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంత కంటే కొద్దిగా నడవడమే మంచిదని మనకు తోచదు.
వాతావరణం మరింతగా క్షీణిం చిపోకుండటానికి ప్రతి చిన్న చర్యను చేపట్టడానికి హామీని కల్పించేలా మన చైతన్యం విస్తరించాలి. ఇంధన వాడకంలో ఎలాంటి వృ«థానైనా అరికట్టడం వాటిలో ఒకటి. నా ప్రతిపాదనలు మరీ అమాయకమైనవిగా అని పించొచ్చు, కానీ ఆవశ్యకమైనవి. ఏదో ఒక వనరు అవసరమైన ప్రతి పనిని గురించి ఆలోచించండి. గదిలోంచి బయటకు వస్తున్న ప్పుడు లైటు ఆపు చేశానా? లెడ్ లైట్లను పెట్టానా, లేదా? నేను లేనప్పుడు ఫ్యాన్ తిరు గుతూనే ఉందా? ఏసీ అభిలషణీయం, సౌకర్యవంతం అయిన 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దనే ఉందా?
ప్రభుత్వాలు పలు ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తే, వాటి వాడకాన్ని ఎందుకు అనుమ తిస్తున్నారని నిలదీయాలి. మరీ ముఖ్యంగా, కూరగాయలు, కిరాణా దుకాణదారుల వద్ద కొనుగోలుదారులు వస్తువులను గుడ్డ సంచులలోనే పట్టుకుపోతున్నారా? వీధిలోని టీ బడ్డీలో వాడే ప్లాస్టిక్ కప్పు నుంచి అన్ని ప్లాస్టిక్ వస్తువులు భూగ్రహానికి తీవ్ర హానిని కలి గించేవే. చేతులు కడిగేటప్పుడు పంపులను తిప్పి ఉంచే తీరు తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన నీటి వృథాకు కారణం. ఇక షవర్ కింద నిమిషాల తరబడి నిలబడటం మరింత వృథా. ఇలా ఈ జాబితా ఎంతైనా సాగుతుంది. మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ ఆంత్రోపొసీన్ యుగంలో ఇతరులు ఈ ప్రపంచం గురించి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com