కాపు సామాజిక వర్గానికే కమలం కిరీటం! | BJP New President to the Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాపు సామాజిక వర్గానికే కమలం కిరీటం!

Apr 18 2018 1:54 AM | Updated on Apr 18 2018 1:54 AM

BJP New President to the Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ శాఖకు నూతన అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మంగళవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును సైతం ఖరారు చేశారని, నేడో రేపో ప్రకటించనున్నారని జాతీయస్థాయిలోని పార్టీ వర్గాలు తెలిపాయి. 

తుది రేసులో ఆ ముగ్గురు.. 
కాగా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి తుది రేసులో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు మిగిలినట్టు సమాచారం. సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను అధినాయకత్వం పరిశీలించిందని పార్టీ జాతీయ నాయకుడొకరు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement