
వైఎస్సార్ సీపీలో చేరిన చిత్తూరు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ వైఎస్ జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్, చంద్రయ్య, డేవిడ్, ముత్తయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్ కార్పొరేటర్ లతా శ్రీధర్ తదితరులు పార్టీలో చేరారు.
మరోవైపు మంగళగిరికి చెందిన పలువురు నేతలు కూడా శుక్రవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మంగళగిరి కౌన్సిలర్ ఉడత శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శంకుతల, బి.నరసింహారావు, షేక్ అక్రమ్, ఎం.బాబురావు, డీ.శ్రీనివాస్, కె.లక్ష్మణ్ రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment