సాక్షి, కాకినాడ : టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పపై వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ దవులురి దొరబాబు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి చినరాజప్పకు లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్క్రిప్ట్ చదివి ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదు.. దమ్ముంటే చినరాజప్ప స్వతంత్రంగా మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇసుక పాలసీలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు మళ్లీ చేయకూదనే సీఎం జగన్ నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని దొరబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment