
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు. ('కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో')
వైఎస్సార్‌సీపీకి మానసికంగా దగ్గరయ్యా..
శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైఎస్సార్‌సీపీకి మానసికంగా దగ్గరయ్యానని..అయితే వైఎస్సార్‌సీపీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
(చక్ర బంధంలో చంద్రబాబు!)