
ప్రకాశ్‌రాజ్
సాక్షి, బెంగళూరు: బీజేపీ నాయకుల అబద్ధాలు తమను కష్టాల్లో నెట్టాలా చేస్తున్నాయని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ఆదివారం హుబ్లీ నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... తానేమైనా ప్రశ్నలను వేస్తే హిందూమత వ్యతిరేకి అనటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను ఆరంభించిన ‘జస్ట్ ఆస్కింగ్’ ఒక రాజకీయ పార్టీ కాదని అదొక ఆందోళన అని స్పష్టం చేశారు. అందరినీ ప్రశ్నించే బాధ్యత తమకు ఉందని అన్నారు.
మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్ దుయ్యబట్టారు. అల్ప సంఖ్యాకులను దేశం నుంచి బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో బీజేపీపై ధ్వజమెత్తారు. దలితులకు తానే ఆశాకిరణమని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గనుల యజమానులను క్షమించాల్సింది యడ్యూరప్ప కాదని, కర్ణాటక ప్రజలని అన్న ఆయన తన పోరాటంలో ఎలాంటి రాజకీయం, దురుద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.