
టీడీపీ ఎంపీలు లోపల బీజేపీ కాళ్లు మొక్కుతారు...
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే.. పవన్ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు నిన్న ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చంద్రబాబుగారూ మీకు ఇదే నా బదులు...’ అంటూ పవన్ ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు(జనసేన) వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారు..
...మరి ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’ అని పవన్ పేర్కొన్నారు
లోపల కాళ్లు మొక్కుతారు... ‘నిన్న ప్రధాన మంత్రి మోదీగారి కాళ్లకి మీ టీడీపీ ఎంపీలు పాధాభివందనం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. అదే సభలో ఓవైపు మీ ఎంపీలు బీజేపీని తిడతారు. ఇంకోవైపు బీజేపీ కాళ్లకు మొక్కుతారు. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌గారు మిమల్ని ఇంకా మిత్రులుగా చూస్తున్నారు అని అంటారు. దీనిని బట్టి ‘మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్ముతామో మీరే చెప్పండి?’ అని చంద్రబాబును ఉద్దేశించి పవన్ ట్వీట్లు చేశారు. రేపు మళ్లీ మీ అవసరాల కోసం.. వైఖరి మార్చుకోరన్న గ్యారెంటీ ఏంటీ?.. అని పవన్ ఏకీపడేశారు.
గల్లాపై సెటైర్... ఎంపీ గల్లా జయదేవ్‌పై పవన్ సెటైర్లు పేల్చారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజిని చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి Convenient Memory loss Syndrome రోజు రోజుకీ పెరిగిపోతోంది.
In case If TDP has memory loss.. pic.twitter.com/Kxf3peoetp
— Pawan Kalyan (@PawanKalyan) 21 July 2018