సాక్షి, న్యూఢిల్లీ : నటుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదం కామెంట్లపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రాజ్‌నాథ్.. కమల్ కేవలం ఓట్ల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పారు.
‘‘హిందువుల్లో హింసా ప్రవృత్తి పెరిగిపోతుందన్న కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఉగ్ర వాదం ఏ రూపంలో ఉన్న మా ప్రభుత్వం అణచివేస్తుంది అని రాజ్ నాథ్ చెప్పారు. రాజకీయ మనుగడ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు’’ అని కమల్‌కు ఆయన సూచించారు. కాగా, పద్మావతి చిత్ర వివాదంపై కూడా ఆయన స్పందించారు. చరిత్రను వక్రీకరించారనే వాదన తెరపైకి వచ్చినప్పుడు నిలిపివేయాలన్న డిమాండ్లు తలెత్తటం సహాజమని.. అవి అబద్ధమని నిరూపించుకోవాల్సిన బాధ్యత చిత్ర నిర్మాతలపై ఉంటుందని ఆయన అన్నారు.
కాగా, హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఒక్క కేరళ ప్రభుత్వం తప్ప మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఘోరంగా విఫలమయ్యాయని కమల్ విరుచుపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీని, దాని అనుబంధ విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఆనంద్ వికటన్ సంచికలో ఆయన వ్యాసం రాశారు.
Comments
Please login to add a commentAdd a comment