
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు కమల్ హాసన్ ‘హిందూ ఉగ్రవాద’ కామెంట్లపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్ ను గురువారం విచారణకు స్వీకరించిన హైకోర్టు... తక్షణమే ఆయన పేరును పొందుపరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించి అందజేయాలని తమిళనాడు పోలీసులను కోర్టు ఆదేశించింది.
కమల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని మొత్తం ఉగ్రవాదులుగా అభివర్ణించేలా ఉందంటూ అడ్వొకేట్ క్లర్క్ జీ దేవరాజన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేసి తమిళ జాతిని విడగొట్టేందుకు కుట్రపన్నారంటూ పిటిషనర్ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో కమల్ రాసిన వ్యాసాన్ని ప్రచురించిన మ్యాగ్జైన్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని దేవరాజన్ కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే ఆయపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తూ ఆదేశాల కాపీని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అందజేసి కేసు వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాగా, ఆనంద వికటన్ మ్యాగ్జైన్ కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో హిందు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తమిళనాడు సహా దేశంలోని ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని ఉళగనాయగన్ మండిపడిన విషయం తెలిసిందే. అయితే తిరిగి నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ తాను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పని ఏనాడూ చెయ్యబోనని.. ఆ వ్యాఖ‍్యల ఆంతర్యం తప్పుగా అర్థం చేసుకున్నారని నష్టనివారణ చర్యలకు దిగారు. (ఇది కూడా చదవండి... నేనూ హిందూ కుటుంబంలోనే పుట్టా! )
వైరల్ వీడియో...
కమల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంప్రదాయ వేషధారణలో ఓ చిన్నారి కత్తితో కసి తీరా కమల్ ఫోటోను పొడవటం.. పక్కనే ఉన్న మరో చిన్నారి అతని ప్రోత్సహించటం అందులో చూడొచ్చు.
இந்து தீவிரவாதம் குழந்தைகள் கையில் கத்தியை திணிக்கிறது. மனம் பதறுகிறது. 😔 @ikamalhaasan நீங்கள் சொன்னதை சரியென்று நிறுவுகின்றனர். pic.twitter.com/ihSESJEXQI
— இசை (@isai_) November 13, 2017