కమల్‌ హాసన్‌కు హైకోర్టులో ఊరట | relief for kamal hassan over mahabharata comments case | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌కు హైకోర్టులో ఊరట

Published Thu, May 4 2017 5:53 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

కమల్‌ హాసన్‌కు హైకోర్టులో ఊరట - Sakshi

కమల్‌ హాసన్‌కు హైకోర్టులో ఊరట

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. కింద కోర్టు ఇచ్చిన సమన్లపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. కాగా హిందువులు పవిత్రంగా భావించే మహాభారతాన్ని అవమానించారంటూ కమల్‌హాసన్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై కమల్‌ హాసన్‌ హైకోర్టు ఆశ్రయించడంతో వలియూర్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. కాగా ఈ ఏడాది మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు నరుంబూనాథర్‌ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు చేశారు.

సినిమాలలో మహిళలపై ఎక్కువగా హింసాత్మక దృశ్యాలు చూపించడం గురించి అడిగిన ఓ ప్రశ్నకు కమల్‌  బదులిస్తూ.. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని చెప్పారు. భారతీయులు మహాభారతాన్ని అమితంగా గౌరవిస్తారని, ఈ ఇతిహాసంలో మహిళను జూదంలో పావుగా చూపించారని తెలిపారు. హిందువులను, మహాభారత్‌ను అవమానించేలా కమల్‌ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా వేయాలని  పిటిషన్‌దారు కోర్టును కోరటంతో ...కమల్‌  ఈ నెల 5న (శుక్రవారం) కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement