remarks against Mahabharata
-
కమల్ హాసన్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. కింద కోర్టు ఇచ్చిన సమన్లపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. కాగా హిందువులు పవిత్రంగా భావించే మహాభారతాన్ని అవమానించారంటూ కమల్‌హాసన్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై కమల్ హాసన్ హైకోర్టు ఆశ్రయించడంతో వలియూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. కాగా ఈ ఏడాది మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు నరుంబూనాథర్ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు చేశారు. సినిమాలలో మహిళలపై ఎక్కువగా హింసాత్మక దృశ్యాలు చూపించడం గురించి అడిగిన ఓ ప్రశ్నకు కమల్ బదులిస్తూ.. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని చెప్పారు. భారతీయులు మహాభారతాన్ని అమితంగా గౌరవిస్తారని, ఈ ఇతిహాసంలో మహిళను జూదంలో పావుగా చూపించారని తెలిపారు. హిందువులను, మహాభారత్‌ను అవమానించేలా కమల్ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా వేయాలని పిటిషన్‌దారు కోర్టును కోరటంతో ...కమల్ ఈ నెల 5న (శుక్రవారం) కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. -
చిక్కుల్లో కమల్ హాసన్
తిరునెల్వేలి: ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిక్కుల్లోపడ్డారు. హిందువులు పవిత్రంగా భావించే మహాభారత ఇతిహాసంపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా తమిళనాడులోని వలియూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో మే 5వ తేదీన హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. నరుంబూనాథర్ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు మేరకు ఈ కేసును విచారణ చేసి, తమకు నివేదిక సమర్పించాల్సిందిగా పజువూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ను వలియూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెంథిల్ కుమార్ ఆదేశించారు. గత మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్‌దారు పేర్కొన్నారు. సినిమాలలో మహిళలపై ఎక్కువగా హింసాత్మక దృశ్యాలు చూపించడం గురించి అడిగిన ఓ ప్రశ్నకు కమల్ బదులిస్తూ.. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని చెప్పారు. భారతీయులు మహాభారత్‌ను అమితంగా గౌరవిస్తారని, ఈ ఇతిహాసంలో మహిళను జూదంలో పావుగా చూపించారని తెలిపారు. హిందువులను, మహాభారత్‌ను అవమానించేలా కమల్ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా వేయాలని పిటిషన్‌దారు కోర్టును కోరారు.