సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత రత్న పార్లమెంట్‌లో నీకు మాట్లాడటానికి లైసెన్స్ ఇచ్చిందా? అంటూ సచిన్‌ను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.
తమ పార్టీ నేత(మన్మోహన్ సింగ్)పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన ప్రధాని క్షమాపణలు చెప్పేంత వరకు సభను సజావుగా సాగనివ్వమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. కాగా, రైట్ టూ ప్లే అండ్ ఫ్యూఛర్ ఆఫ్ స్పోర్ట్స్ అనే అంశంపై సచిన్ ప్రసంగించాల్సి ఉండగా.. కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో సభ నేటికి వాయిదా పడింది. యూపీఏ హయాంలోనే సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
మరోపక్క బీజేపీ నేతలు సచిన్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడికి ఇలాంటి గౌరవం ఇస్తారా? అంటూ ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు. సచిన్ ప్రమాణం చేసిన నాటి నుంచి మొత్తం 348 రోజులు సభ జరిగితే ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఆయనతోపాటే నామినేట్ అయిన నటి రేఖ 18 రోజులు మాత్రమే సభకు హాజరు కావటం విశేషం.
It's a sad day in the history of Rajya Sabha Proceedings that the Greatest Cricketer of all time & a Bharat Ratna Awardee @sachin_rt was not allowed to share his views on a completely apolitical subject as sports by the members of the same Congress Party who brought him here.
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 21, 2017
రాజ్యసభ 27కి వాయిదా...
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ పై చేసిన కామెంట్లు పార్లమెంట్‌ను దద్దరిల్లేలా చేస్తున్నాయి. రాజ్యసభ ప్రారంభం అయ్యాక తిరిగి కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించటం.. సభ సజావుగా నిర్వహించే పరిస్థితులు కనిపించకపోవటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment