కుమారస్వామి(ఎడమ), రేవణ్ణ(కుడి)
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా జేడీఎస్ పార్టీలో బీజేపీ వర్గపోరు చిచ్చును రాజేసింది. దేవేగౌడ రెండో తనయుడు రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
దీంతో కర్ణాటక రాజకీయాలు మరోమారు కీలక మలుపు తీసుకున్నాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌తో రేవణ్ణ వర్గం మద్దతు పార్టీకి ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
దీంతో జేడీఎస్‌లో చీలిక తలెత్తుతుందోమోనేనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు కుమారస్వామి మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలుసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment