
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడి చేతిలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కీలుబొమ్మగా మారారని జనచైతన్య వేదిక రాష్ట్రాధ్యక్షులు లక్ష్మణ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న అశోక్ బాబు.. బెంగళూరులో రాజకీయ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్న అశోక్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్జీవోల ప్రయోజనాల కన్నా.. అశోక్ బాబు టీడీపీ ప్రయోజనాలు కోసం కృషి చేస్తున్నారని లక్ష్మణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. అశోక్ బాబు చేస్తున్న ఎన్నికల ప్రచారంపై బీజేపీ నాయకులు కూడా నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment