
హన్మకొండ చౌరస్తా: కొండా దంపతులది నీచ రాజకీయ చరిత్ర అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తమకు రాజకీయ జన్మనిచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. రాజకీయ పునర్జన్మను ప్రసాదించింది కేసీఆర్ అని గతంలో అనేక సార్లు చెప్పిన కొండా దంపతులు నేడు విమర్శించడమే వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన పదవులను అనుభవించి నేడు అదే కుటుంబంపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. లక్ష డాల ర్ల ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంలో తాను సైతం అంటూ పాల్గొన్న కేటీఆర్‌ను, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలిపేందుకు తన సొంత ఖర్చులతో సమైక్య పాలనలో వెలుగెత్తి చాటిన కవితను విమర్శించే స్థాయి కొండా దంపతులకు లేదన్నారు. ఆయన వెంట ఎంపీ పసునూరి దయాకర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment