రిషబ్ పంత్
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ యువ సంచలనం రిషబ్ పంత్ మరోసారి శతకాన్ని చేజార్చుకున్నాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సెంచరీ మిస్ చేసుకున్న పంత్‌కు ఈ మ్యాచ్‌లోను దురదృష్టం వెంటాడింది. 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేసిన పంత్ గాబ్రియల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక రాజ్ కోట్, హైదరాబాద్ రెండు వేదికల్లోను పంత్ 92 పరుగుల వద్దే వెనుదిరగడం గమనార్హం. పంత్ శతకాన్ని చేజార్చుకోవడం సచిన్ 90ల ఫోబియాను గుర్తుచేస్తోంది.
308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (2), కుల్‌దీప్(0)లో ఉండగా.. భారత్ 11 పరుగుల ఆధిక్యం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment