
న్యూఢిల్లీ: ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలకు జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన సందర్భంలో... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాల కోసం ఫోన్ చేసినట్లు గత వారం రిటైరైన భారత హాకీ స్టార్ సర్దార్ సింగ్ వెల్లడించాడు. ‘సచిన్ నాకు ఆదర్శం. కఠినంగా సాగిన గత మూడు నెలల కాలంలో ఆయన చాలా సాయపడ్డారు. విమర్శలు మర్చిపోయి ఆటపై దృష్టిపెట్టమని సూచించారు. నా పాత వీడియోలను చూసి పొరపాట్లు దిద్దుకుంటూ, సహజమైన ఆట కొనసాగించమని పేర్కొన్నారు. ఆ సూచనలతో గాడినపడ్డా’ అని సర్దార్ వివరించాడు.