జింబాబ్వేతో జరుగుతున్న మూడో టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది.
తొలి ఇన్నింగ్స్ 503
జింబాబ్వేతో మూడో టెస్టు
చిట్టగాంగ్: జింబాబ్వేతో జరుగుతున్న మూడో టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. రెండో రోజు గురువారం షకీబ్ అల్ హసన్ (110 బంతుల్లో 71; 7 ఫోర్లు), రూబెల్ హొస్సేన్ (44 బంతుల్లో 45; 2 ఫోర్లు; 4 సిక్సర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ 153.4 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటయ్యింది.
ఓవర్‌నైట్ స్కోరు 303/2తో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టును జింబాబ్వే బౌలర్లు కట్టడి చేశారు. సికందర్ రజాకు మూడు వికెట్లు, షింగి మసకద్జా, హామిల్టన్ మసకద్జా, పన్యాంగరాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది.