రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌ను లాంగ్ డిస్టెన్స్ రేస్‌తో పోల్చడం కాస్త అసహజంగా అనిపించినా సారాంశం మాత్రం ఒక్కటిగానే కనిపిస్తుంటుంది. రెండేళ్ల క్రితం అందరికన్నా ముందు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తుది పోరులో బోల్తా పడింది. తాజాగా రేసులో గుజరాత్ లయన్స్ అందరికన్నా ముందుంది. ఆరంభంలో తడబడుతూ కనిపించినా చివర్లో పుంజుకుని ఇలాంటి జట్లకు షాక్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ లాంటి జట్లు కూడా పోటీలో ఉంటాయి. అందుకే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు లీగ్ ఫినిషింగ్ దశకు వచ్చేసింది. ఈసారి ముంబై రేసులో నిలవాలంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం కీలకం.
మరోవైపు కోహ్లి బృందం వరుసగా రెండు విజయాలతో రేసులో ముందుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఓడిన జట్టు మెడపై కత్తి వేలాడుతున్నట్టే. ఇద్దరు అత్యుత్తమ లక్ష్య ఛేదన మొనగాళ్లయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య జరిగే పోటీగా దీన్ని భావించాల్సి ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఒంటి చేత్తో మార్చగల సమర్థులు వీరు. అయితే గతంలోనే చెప్పుకున్నట్టు బౌలింగ్ మెరుగ్గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.
ఈ విషయం తాజా లీగ్‌లో చాలాసార్లు రుజువైంది కూడా. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే ముంబై ఇండియన్స్‌కు ఎక్కువ అవకాశం ఉంది. కానీ భారీ లక్ష్యం కోసం బెంగళూరు ఛేజింగ్‌కు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. కోహ్లి దూకుడుతో పాటు డివిలియర్స్, వాట్సన్ కూడా అండగా ఉంటారు. ఈవిషయం ప్రత్యర్థికి కూడా తెలుసు. ఇక ముంబై బ్యాటింగ్ అంతా రోహిత్‌పై ఆధారపడి ఉండడం కలవరపరిచే విషయమే.
విరాట్, రోహిత్‌ల పోరాటం హర్షా భోగ్లే
Published Wed, May 11 2016 1:20 AM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM
Advertisement
Advertisement