
మీ ఉద్యోగులకు సెలవు ఇవ్వండి!
కార్యాలయాలకు మెకల్లమ్ బహిరంగ లేఖ
ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో సెమీస్ సందర్భంగా మైదానానికి వచ్చి తమ జట్టుకు మద్దతు పలకాలని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తమ అభిమానులను కోరాడు. ఇందు కోసం అతను అనూహ్య రీతిలో కొత్త పద్ధతిని అనుసరించాడు. మంగళవారం ఉద్యోగులకు సెలవు ఇవ్వాలంటూ కార్యాలయాలకు బహిరంగ లేఖ రాశాడు. .....అనే వ్యక్తికి విధులనుంచి సంబంధిత అధికారులు మినహాయింపు ఇవ్వమని, వారు ఆఫీసులో లేకపోయినా ఈడెన్ పార్క్‌లో ఉండేలా చూడమంటూ మెకల్లమ్ సంతకంతో కూడిన లేఖ న్యూజిలాండ్‌లో సర్క్యులేట్ అయింది. ‘మైదానానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మీ కోసం సీటును సిద్ధంగా ఉంచాం. అక్కడే ఉన్న జాతీయ జెండా తనంతట తానుగా ఎగరలేదని గుర్తుంచుకోండి’ అంటూ మెకల్లమ్ ఈ లేఖలో కోరాడు.