షోయబ్‌.. సచిన్‌ను మరిచిపోయావా ? | Cricket Fans Troll On Shoaib Akhtar | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 2:28 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Cricket Fans Troll On Shoaib Akhtar - Sakshi

షోయబ్‌ అక్తర్‌

వారంతా నన్ను క్రికెట్‌ డాన్‌ అని పిలిచేవారు..

ఇస్లామాబాద్‌: పాక్తిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ట్విటర్‌ వేదికగా షోయబ్‌ క్రికెట్‌కు తనే డాన్‌ అని ప్రకటించుకున్నాడు. ఈ వ్యాఖ్యలు యావత్‌ క్రికెట్‌ అభిమానులుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా షోయబ్‌ అక్తర్‌ను ఏకీపారేశారు.

షోయబ్‌ ట్వీట్‌ ఏంటంటే.. తన బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ వివిధ దేశాల ఆటగాళ్లందరి ఫొటోకు క్యాప్షన్‌గా.. ‘వారంతా నన్ను క్రికెట్‌ డాన్‌ అని పిలిచేవారు. నా బౌలింగ్‌ శైలిని అలా ఉండేది. వాళ్లను గాయపరిచి ఎంజాయ్‌ చేసేవాడిని కాదు. కానీ నా దేశ కోసం.. నా అభిమానుల కోసం నేను అలా ఆడేవాడినని చెప్పగలను.’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు సెటైర్ల్‌ వేస్తున్నారు. ‘ఏ షోయబ్‌ సచిన్‌ టెండూల్కర్‌ను మరిచిపోయావా?’ అని ప్రశ్నిస్తూ.. షోయబ్‌ బౌలింగ్‌ను సచిన్‌ చీల్చిచెండాడిన వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement