
దుబాయ్: తాను జరిమానా ఎదుర్కొవడానికి సిద్ధంగా లేనని మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని చమత్కరించాడు. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్ ఫలితంపై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘ఛేజింగ్‌లో మేము ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్ల నుంచి శుభారంభం లభించినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్ది బౌలర్లకు పిచ్ అనుకూలంగా మారింది. ఎవరో ఒకరు బాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు మేము పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. సరిపడా స్పిన్నర్లు కూడా లేరు. సీమర్లు స్వింగ్ చేయలేకపోయారు. దీంతో ఆరంభంలో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నామ’ని తెలిపాడు.
రనౌట్లు, మరికొన్ని అంశాలు(తప్పుడు ఎల్బీ నిర్ణయాలు) కారణంగానే మ్యాచ్‌ను ఫలితం తేలకుండా ముగించాల్సి వచ్చిందన్నాడు. వాటి (అంపైర్ల నిర్ణయాలు) గురించి మాట్లాడి జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదని సరదాగా అన్నాడు. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు చాలా బాగా ఆడారని కితాబిచ్చాడు. ఈ పిచ్‌లో 250 పరుగులు చాలా మంచి స్కోరని, ఈ మ్యాచ్‌ను బాగా ఆస్వాదించామని పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్ బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా ఉందని ధోని మెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment