టీమిండియా బస్సును అడ్డుకుంటున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్
బర్మింగ్‌హామ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అవమానించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ ప్రేమికులు యత్నించారు. తొలిటెస్ట్ ఓటమి అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు ఇంగ్లండ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అవుతున్నారు. కోహ్లి అద్వితీయ ఆటతీరుతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టు భారాన్ని మోశాడు. కానీ ఇతర బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో తప్పిదాల వల్లే నెగ్గుతుందనుకున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో చివరికి 31 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. (శిఖరాన విరాట్)
టెస్టు ముగిసిన అనంతరం హోటల్ రూముకు వెళ్లేందుకు టీమిండియా బస్సు సిద్ధమైంది. అయితే అదే సమయంలో కొందరు ఇంగ్లండ్ అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బస్సును అడ్డుకుని.. మీ కోహ్లి ఎక్కడున్నాడు.. మాకు అండర్సన్ ఉన్నాడంటూ నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది వారిని వారించి అక్కడినుంచి పంపేశారు. అయితే ఓటమిపాలైన తర్వాత కోహ్లి ముఖం చూడాలని ఇంగ్లండ్ వాసులు చేసిన చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ నెగ్గితే సంబరాలు చేసుకోవాలే కానీ.. మా జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ కోహ్లిని అవమానించడం తగదని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
మరోవైపు తొలిటెస్ట్‌లో ప్రదర్శనతో కోహ్లి 934 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డేల్లోనూ కోహ్లినే టాప్ ర్యాంకర్ అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment