
టి20 ప్రపంచకప్‌లో భారతే ఫేవరెట్: సచిన్
న్యూఢిల్లీ: స్వదేశంలో టి20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడానికి భారత్‌కు మంచి అవకాశం వచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పాడు. ‘మనకు ఇదో మంచి అవకాశం. సీనియర్లు, కుర్రాళ్లతో కూడిన టి20 జట్టు మంచి సమతుల్యంతో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు కూడా. ఆసీస్‌లో బుమ్రా బౌలింగ్ అద్భుతం. అలాగే నెహ్రా, యువీ, హర్భజన్‌లు జట్టులోకి రావడం చాలా మంచి పరిణామం. వీళ్లందరి మేళవింపుతో ధోనిసేన చాలా పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి టోర్నీలో సత్తా చూపెట్టాలని కోరుకుంటున్నా’ అని మాస్టర్ పేర్కొన్నాడు.