బోట్లు కొనుక్కుని రోడ్లపై తిరగాలా? : గంభీర్
న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై టీమిండియా ఆటగాడు గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నగర పౌరుల సాధారణ సమస్యలపై కూడా అధికారులు స్పందించడం లేదని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వానల వల్ల తలెత్తుతున్న సమస్యలను అధికారులు పరిష్కరించనందున ఇక మేము బోట్లు కొనుక్కునే సమయం ఆసన్నమైందంటూ వ్యంగ్యాస్త్రాలను తన ట్వీట్ ద్వారా సంధించాడు.
ఢిల్లీలో కురుస్తున్న వర్సాల వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, ఇక బోట్లు కొనుక్కుని వాటిలోనే రోడ్లపై ప్రయాణించాల్సి ఉంటుందని ప్రభుత్వ పనితీరును గంభీర్ విమర్శించాడు. ఇందులోనూ సరి, బేసి సంఖ్య ఉండే బోట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందేమో అంటూ వాహనాల సరి-భేసి విధానాన్ని కూడా ప్రశ్నించినట్లు అర్థమవుతోంది. ఢిల్లీరెయిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఢిల్లీలో వాన వల్ల తలెత్తుతున్న సమస్యలపై రెండు ట్వీట్లు చేశాడు.
Maybe it's time we started buying boats in Delhi since the authorities responsible can't solve basic civic troubles! #DelhiRains
— Gautam Gambhir (@GautamGambhir) 31 August 2016
Odd and even boats for Delhi now, maybe ? Ridiculous drainage facilities in the capital! #DelhiRains pic.twitter.com/qm6R4RlpTM
— Gautam Gambhir (@GautamGambhir) 31 August 2016