సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లోఎంతో మంది బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నాడు టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్. తమకు అర్థంకాని బౌలర్లు అంటూ తలలు పట్టుకున్న బ్యాట్స్‌మెన్లకు చిట్కాలు చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అలాంటిది ఓ చిన్ని బౌలర్ బంతులను ఎదుర్కొనేందుకు చాలా ఒత్తిడిగా ఫీలయ్యానంటూ గంభీర్ చేసిన వీడియో ట్వీట్ వైరల్ అయింది.
గంభీర్ నాలుగేళ్ల కూతురు ఆజీన్ చదువుతోన్న పాఠశాలలో ఇటీవల ఓ ఈవెంట్ నిర్వహించగా, ప్రత్యేక అతిథిగా గంభీర్ పాల్గొన్నారు. చిన్నారుల బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసి వారిని సంతోషపెట్టాలని చూశాడు గంభీర్. ఐతే స్కూలు యాజమాన్యం గంభీర్ కూతురు ఆజీన్ చేతికి బంతినందించారు. కూతురు వేసిన బంతిని గంభీర్ ఎంతో ఒత్తిడిలో ఆడినట్లు వెల్లడిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘నాకు ఔట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయాలని నా కూతురు ఆజీన్‌కు తెలుసు. ఆజీన్ బౌలింగ్ ఆడటానికి ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’ అంటూ గంభీర్ చేసిన వీడియో ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
High pressure job facing my daughter Aazeen’s bowling at her school. Hell, even she knows d line has to be outside d off stump vs papa!!!😊😊 pic.twitter.com/DX8SJOiLpI
— Gautam Gambhir (@GautamGambhir) 6 November 2017
Comments
Please login to add a commentAdd a comment