జింఖానా, న్యూస్‌లైన్: సచ్‌దేవ్ స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నీలో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు గెలుపొందింది. తిరుమలగిరి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో శాస్త్రి సాకర్ క్లబ్ నిర్వహించిన ఈ టోర్నీలో గురువారం గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు 5-0తో సాక్రెడ్ హార్ట్ జట్టుపై గెలిచింది. మ్యాచ్ మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 1-0తో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు ఆటగాళ్లు కిరణ్ (3), అరవింద్ (1), ప్రభాకర్ (1) చెలరేగడంతో జట్టుకు ఏకపక్ష విజయం చే కూరింది. మరో మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 4-0తో ఫిత్జీ జట్టుపై నెగ్గింది.
ప్రథమార్ధంలో 2-0తో సెయింట్ ఆండ్రూస్ జట్టు ముందంజలో ఉంది. జట్టులో భరత్ (2), గులామ్ (1), జస్టిన్ జేమ్స్ (1) రాణించారు. అనంతరం మరో మ్యాచ్‌లో తేజస్విని జట్టుపై 6-0తో భవాన్స్ జట్టు విజయం సాధించింది. మయూర్ రెండు గోల్స్ చేయగా... శరణ్, కపిల్, ఆన్ తలా ఒక గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు..
గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ గెలుపు
Published Thu, Jan 16 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement