'స్వీట్ బాయ్'గా హర్భజన్ | Harbhajan Singh becomes sweets seller for 'Mission Sapne' | Sakshi
Sakshi News home page

'స్వీట్ బాయ్'గా హర్భజన్

Published Sun, Jan 26 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

'స్వీట్ బాయ్'గా హర్భజన్

'స్వీట్ బాయ్'గా హర్భజన్

ముంబై: భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో స్వీట్లు విక్రయించనున్నాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన భజ్జీ కొత్త వ్యాపారమేమీ ప్రారంభించలేదు కానీ ఓ టెలివిజన్ షోలో భాగంగా సేల్స్మన్ అవతారమెత్తనున్నాడు. 'మిసన్ సాప్నే' అనే షోలో భజ్జీ సందడి చేయనున్నాడు. కలర్స్ చానెల్లో ఈ కార్యక్రమం ప్రసారంకానుంది.
 
ఈ కార్యక్రమంలో భాగంగా హర్భజన్ బిస్కెట్లు అమ్మనున్నాడు. బాలీవుడ్, టెలివిజన్, స్పోర్ట్స్ రంగాలకు చెందిన ప్రముఖులు ఓ రోజు సాధారణ వ్యక్తిగా గడిపేలా ఈ షోను రూపొందిస్తున్నారు. గతంలో పలు టీవీ షోల్లో పాల్గొన్న భజ్జీ తాజాగా కొత్త గెటప్లో కనిపించనున్నాడు. ఈ షోలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో పాటు వరుణ్ ధావన్, మిఖా సింగ్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. సెలెబ్రిటీలు సొంతంగా టాక్సీ నడపడం, డోర్ టు డోర్ తిరిగే సేల్స్మన్గా వంటి విన్యాసాలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement