సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సన్నాహకంలో భాగంగా జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌తో తొలి సారి ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. చివరి రోజు ప్రాక్టీస్‌లో అదరగొట్టాడు. తొలి మూడు రోజులు బౌలింగ్ చేయని బుమ్రా.. శనివారం అద్భుత యార్కర్‌తో ఆస్ట్రేలియా ఎలెవన్ బ్యాట్స్‌మన్ జాక్సన్ కొలెమాన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. తన స్టన్నింగ్ యార్కర్‌తో ఈ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్.. ఆతిథ్య జట్టుకు సిరీస్ ముందే వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో బుమ్రా.. ఇషాంత్‌తో కలిసి బౌలింగ్ బాధ్యతలను చేపట్టనున్నాడు.
నాలుగు రోజుల పాటు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో యువసంచలనం పృథ్వీషా ఫీల్డింగ్ చేస్తూ గాయపడి తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. విజయ్ తనదైన శైలిలో సెంచరీతో చెలరేగి సిరీస్‌కు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. గత కొద్దిరోజులగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు.
Jasprit Bumrah cleans up the final CA XI wicket. All out for 544, a lead of 183.
— cricket.com.au (@cricketcomau) December 1, 2018
Scorecard: https://t.co/bRjvo3LvLP #CAXIvIND pic.twitter.com/4cmRhPLEOX
Comments
Please login to add a commentAdd a comment