వెస్టిండీస్-ఎతో భారత్-ఎ రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది.
వెస్టిండీస్-ఎతో భారత్-ఎ రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి, నాలుగో రోజు శనివారం 28/0 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు.. బ్రాత్ వైట్ (104) మరోసారి విజృంభించి అజేయ సెంచరీ చేయడంతో మూడు వికెట్లకు 223 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించారు. డియోనరైన్ (93) సెంచరీకి ఏడు దూరంలో అవుటయ్యాడు. భారత బౌలర్ భార్గవ్ భట్ రెండు వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్లో విండీస్ 406 పరుగులు చేయగా, భారత్-ఎ 359 స్కోరు నమోదు చేసింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో విండీస్ 1-0తో ముందంజలో ఉంది. తొలి మ్యాచ్లో కరీబియన్లే గెలుపొందారు.