భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది.
నాటింగ్హామ్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ ముగిసింది.
167/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 391/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బిన్ని (78), భువనేశ్వర్ కుమార్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 457, ఇంగ్లండ్ 496 పరుగులు చేశాయి.