కోహ్లి మెరుపులు | india set target of 193 runs for west indies | Sakshi
Sakshi News home page

కోహ్లి మెరుపులు

Published Thu, Mar 31 2016 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

కోహ్లి  మెరుపులు

కోహ్లి మెరుపులు

ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు.  విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడటంతో టీమిండియా 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(43;31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లు) దాటిగా ఆడగా, అజింక్యా రహానే(40;35 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ..  బద్రీ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

 

ఆ తరుణంలో రహానేకు జతకలిసిన కోహ్లి ఆదిలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా తరువాత తనదైన మార్కుతో ఆటతో రెచ్చిపోయాడు. అతనికి జతగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్) అండగా నిలవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు నమోదు చేసింది.  విండీస్ బౌలర్లలో రస్సెల్, బద్రిలకు తలో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement