
యోగ్‌జకార్తా (ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో స్వీడన్‌ను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–మిథుల ద్వయం 21–16, 16–21, 21–15తో టిల్డా సజూ–కార్ల్ హర్‌బాకా జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–11, 21–9తో కొలిన్ హమర్‌బర్గ్‌ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యాన్ని అందించాడు.
మహిళల సింగిల్స్‌లో అష్మిత చలిహా 21–8, 21–14తో అశ్వతిపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపలి ద్వయం... మహిళల డబుల్స్‌లో రితూపర్ణ–మిథుల జంట ఓడిపోయాయి. ఐదు జట్లున్న గ్రూప్ ‘డి’లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ 5–0తో అమెరికా, హంగేరి, ఆస్ట్రేలియాపై గెలిచింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment