హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగనుంది.
అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. మరి ఇప్పుడు ఆ లెక్కను హైదరాబాద్ సరిచేయాలని భావిస్తోంది. ఈ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లలో కోల్ కతా ఒకటి. ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్లు ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. మరొకవైపు సన్ రైజర్స్ తొమ్మిది మ్యాచ్ లకు గాను ఐదింట గెలుపొందింది.
సన్ రైజర్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషిద్ ఖాన్, సిద్ధార్ధ్ కౌల్, మొహ్మద్ సిరాజ్
కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్), సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, షెల్డాన్ జాక్సన్, గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్