![క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ](/styles/webp/s3/article_images/2017/09/4/81470374500_625x300.jpg.webp?itok=202Lp_50)
క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ
హైదరాబాద్: వి.వి.నటూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి కె.శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-8తో వైష్ణవి బాలీ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన కృష్ణప్రియ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తోంది.