కెర్బర్ ‘నంబర్ వన్’ విన్ | New world number one Angelique Kerber into US Open final | Sakshi
Sakshi News home page

కెర్బర్ ‘నంబర్ వన్’ విన్

Published Fri, Sep 9 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

కెర్బర్ ‘నంబర్ వన్’  విన్

కెర్బర్ ‘నంబర్ వన్’ విన్

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల ఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా, జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తలపడనున్నారు. శనివారం టైటిల్ పోరు జరగనుంది. సెమీస్ లో ప్లిస్కోవా, కెర్బర్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. తొలి సెమీస్ లో సెరెనా విలియమ్స్ ను ప్లిస్కోవా ఓడించింది.

రెండో సెమీస్ లో వోజ్నియాకిపై కెర్బర్ గెలిచింది. 6-4, 6-3తో ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.1996లో స్టెఫీగ్రాఫ్‌ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ ఘనత సాధించింది. 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకుంది. యూఎస్ ఓపెన్ లో ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు కెర్బర్ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. తన క్రీడా జీవితంలో ఇదో అద్భుతమైన రోజు అని కెర్బర్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement