సైనా, సింధు ప్రదర్శనపై గోపీచంద్
సాక్షి, తిరుమల: భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధుల ప్రదర్శన పట్ల భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగే టోర్నీల్లో వారు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గోపీచంద్, ఆయన సతీమణి లక్ష్మి తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
‘శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో సింధు కాంస్యం నెగ్గడం సంతృప్తిగా ఉంది. విశ్రాంతి అనంతరం సైనా నెహ్వాల్ కూడా మరిన్ని టోర్నీల్లో పాల్గొనబోతోంది. వీరిద్దరు నిలకడగా ఆడి విజయాలు సాధిస్తారని నాకు విశ్వాసం ఉంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. భారత బ్యాడ్మింటన్‌కు మంచి జరగాలని కోరుకుంటూ, శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోపీచంద్ కుటుంబంతోపాటు హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు.
మరిన్ని విజయాలు అందిస్తారు
Published Mon, Apr 28 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement