ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి పీవీ సింధు, శ్రీకాంత్ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 21–17, 15–21తో హీ బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 14–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 11–21, 21–16, 12–21తో మొహమ్మద్ అహసన్–సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment