మహిళా క్రికెటర్లకు రైల్వే శాఖ ప్రమోషన్లు
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్ క్రికెట్‌లో అత్యద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లకు రైల్వే శాఖ నేరుగా పదోన్నతి కల్పించనుంది. ప్రస్తుతం జట్టులోని 15 మంది క్రీడాకారిణులలో 10 మంది రైల్వే ఉద్యోగులే ఉండటం విశేషం. ఇందులో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్, ఏక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మేష్రమ్, రాజేశ్వరి, నుజ్హత్ పర్వీన్ ఉన్నారు.
‘భారత జట్టుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా పాలసీ ప్రకారం వారికి నజరానా కూడా ఇవ్వనున్నాం’ అని రైల్వే క్రీడాభివృద్ధి కార్యదర్శి రేఖా యాదవ్ తెలిపారు. మరోవైపు హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షల నజరానా ప్రకటించడంతోపాటు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసింది.