రియల్ మాడ్రిడ్‌కు క్లబ్ వరల్డ్ కప్ టైటిల్ | Real Madrid beat San Lorenzo to take Club World Cup crown | Sakshi
Sakshi News home page

రియల్ మాడ్రిడ్‌కు క్లబ్ వరల్డ్ కప్ టైటిల్

Published Mon, Dec 22 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

రియల్ మాడ్రిడ్‌కు క్లబ్ వరల్డ్ కప్ టైటిల్

రియల్ మాడ్రిడ్‌కు క్లబ్ వరల్డ్ కప్ టైటిల్

మర్రాకెచ్ (మొరాకో): అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు ‘క్లబ్ వరల్డ్‌కప్’ విజేతగా నిలిచింది. క్లబ్‌స్థాయి ఫుట్‌బాల్‌లోని అన్ని గొప్ప టైటిల్స్‌ను దక్కించుకున్న రియల్ మాడ్రిడ్ ఈ టైటిల్‌ను తొలిసారి చేజిక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ 2-0 తో సాన్ లోరెంజో (అర్జెంటీనా)పై నెగ్గింది.
 
 ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ సాధించిన నాలుగో ట్రోఫీ ఇది. చాంపియన్స్ లీగ్, కోపా డెల్ రే, యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌తో పాటు లా లిగా లీగ్‌లోనూ రియల్ టాప్‌లో నిలిచింది. వరుసగా 21 మ్యాచ్‌ల్లో అపజయం ఎరుగని రియల్ జట్టు... లోరెంజోతో జరిగిన టైటిల్ పోరులో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. రామోస్ (37వ ని.), బేల్ (51వ ని.) రియల్ జట్టుకు గోల్స్ అందించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఆక్లాండ్ సిటీ క్లబ్ జట్టుకు మూడో స్థానం లభించింది.
 

Advertisement

పోల్

Advertisement