పెటాకు రోహిత్ ప్రచారం
ముంబై: భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జంతు సంరక్షణ సంస్థ... పెటా తరఫున ప్రచారంలో పాల్గొననున్నాడు. వీధుల వెంట తిరిగే పిల్లి, కుక్కల్లో సం తానోత్పత్తిని నిరోధించేందుకు తను మద్దతునివ్వనున్నాడు.
ఈమేరకు రోహిత్ ఫొటో షూటింగ్‌లో పాల్గొ నడంతో పాటు పెటా ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తన ఆలోచనలను పంచుకోనున్నాడు. ‘వీధుల్లో అనాథగా తిరిగే పిల్లులు, కుక్కల సంతతిని అడ్డుకునేందుకు ఇది చక్కని మార్గం’ అని రోహిత్ అన్నాడు.