
సైనా మళ్లీ నంబర్‌వన్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి వారం రోజుల పాటే ఆ ర్యాంక్‌లో కొనసాగింది. మలేసియా ఓపెన్ సెమీస్‌లో ఓడటంతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. మరోవైపు పి.వి.సింధు మూడు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, పారుపల్లి కశ్యప్ 14, హెచ్.ఎస్.ప్రణయ్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు.